కరోనాలో పారిశుధ్య సిబ్బంది సేవలు అమోఘం..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-06-01 12:09:00

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బది కరోనా జాగ్రత్తలు పాటిస్తే ప్రజలకు సేవలు అందించాలని మేయర్ గోలగాని హరి వెంకట కుమారి కోరారు.  మంగళవారం రెండవ జోన్ పరిధిలో 13వ వార్డు లోని ఫ్రంట్ లైను వారియర్స్ అయిన 100 మంది పారిశుధ్య సిబ్బందికి భోజనం, మాస్కులు, శానిటైజర్సు, గ్లౌజులు పంపిణీ చేసారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో పారిశుధ్య కార్మికులకు  13వ వార్డు సెక్టరు-5 బాల్వాడి భవనంలో వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత వీటిని అందించడానికి ముందికి రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా 60 సంవత్స రాలు పైబడిన పారిశుధ్య సిబ్బంది ఏడుగురిని ఘనంగా సన్మానించారు.   ఈ కార్యక్రమంలో 13వ వార్డు ఇంచార్జ్ కెల్లా సత్యనరాయణ, ఎస్.సి., ఎస్.టి. జిల్లా మాజీ అధ్యక్షులు పి.రామారావు, గుడ్ వర్క్ స్టేట్ అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.  
సిఫార్సు