అర్హులైన ప్రతీ ఒక్కరికీ పించను..


Ens Balu
1
విశాఖసిటీ
2021-06-01 12:12:51

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరినీ పించను మంజూరు చేస్తుందని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. మంగళవారం రెండవ జోన్ పరిధిలోని 13వ వార్డు పరిధిలో కొత్తగా మంజూరైన పించన్లను మేయర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు ప్రతీ నిరుపేదకు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట అందించాలనే లక్ష్యంతో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి పించన్లు కూడా అక్కడి నుంచే మంజూరు చేయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు ఇంచార్జ్ కెల్లా సత్యనరాయణ, ఎస్.సి., ఎస్.టి. జిల్లా మాజీ అధ్యక్షులు పి.రామారావు, గుడ్ వర్క్ స్టేట్ అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు