వేక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి..


Ens Balu
0
Collector Office
2021-06-01 12:15:36

విశాఖ జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ జిల్లా వైద్య ఆరోగ్యాధికారి మరియు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులను  ఆదేశించారు.  మంగళవారం ఉదయం కలెక్టరు ఈ విషయంపై తన ఛాంబర్ లో  వైద్యాధికారులతో చర్చించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు  జిల్లాలోని రైల్వే, నేవీ, స్టీల్ ప్లాంట్, తదితర సంస్థలకు ఎన్ని డోసులు పంపిణీ చేశారు, సదరు సంస్థలు ఎంత మందికి వ్యాకినేషన్ గావించాయి, మిగిలినవి ఎన్ని అనే విషయాలపై  వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమయము వృధా కారాదని, వారి వద్ద మిగిలిన వ్యాక్సిన్లను తెప్పించి  45  సంవత్సరములు దాటిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సినేషన్ ఇచ్చే ఏర్పాటు గావించాలని ఆదేశించారు. ఈ  సమావేశంలో జాయింట్ కలెక్టరు పి.అరుణ్  బాబు, డి.ఎమ్.హెచ్.ఒ. సూర్యనారాయణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జీవన్ రాణి పాల్గొన్నారు.
సిఫార్సు