హౌసింగ్ లే ఔట్ పనులను పూర్తి చేయాలి..
Ens Balu
1
Collector Office
2021-06-01 12:18:07
విశాఖ జిల్లాలో జగనన్న హౌసింగ్ మొదటి దశ గ్రౌండింగ్ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ప్రోజెక్ట్ డైరెక్టరు శ్రీనివాసరావును ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టరు జగనన్నహౌసింగ్ మొదటి దశ పనుల పురోగతి పై హౌసింగ్, గ్రామీణ నీటి సరఫరా, ఎపిఇపిడిసిఎల్ అధికారులతో సమీక్షించారు. మొదటి దశలో భీమిలి, పెందుర్తి నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట నియోజికవర్గాలలో జగనన్న హౌసింగ్ లేఔట్ లలో పురోగతిపై చర్చించారు. నియోజిక వర్గాల ప్రత్యేకాధికారులకు వివరాలు తెలియజేయాలన్నారు. లేఔట్ లలో ఎలక్ట్రిఫికేషన్, నీటిసరఫరా, తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు 2 పి.అరుణ్ బాబు, పి.డి. హౌసింగ్ శ్రీనివాసరావు, ఆర్.డబ్ల్యూఎస్ రవి కుమార్, ఎపిఇపిడిసిఎల్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.