మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డు సచివాలయాల్లో ఒక చెత్త తరలించే వాహనం ఉండాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తమ చాంబర్ నుండి సిస్కో వెబెక్స్ ద్వారా జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైధ్యాదికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఎఎంఒహెచ్ లు, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి సచివాలయానికి ఒక చెత్త తరలించే వాహనం ఉండాలని, అది ప్రతి రోజు రెండు ట్రిప్పులు తిరగాలని అధికారులను ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ, కాలువలు శుభ్రం చేయడం వంటి పనులు చేయడం ఎవ్వరికి కేటాయించనివి వారిచే చేయించాలని అన్ని పనులకు ఒకర్ని వాడరాదని, పోరుగుసేవల సూపర్వైజర్లను కాలువలు క్లీనింగు చేయుటకు ఉపయోగించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయరాదని డోర్ టు డోర్ సేకరించిన చెత్తను వెంట వెంటనే డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త కనిపిస్తే శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు శానిటరి కార్యదర్శులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇపిడిసిఎల్ వారు వైర్ల క్రింద ఉన్న కొమ్మలు తొలగించి అక్కడే వదిలివేస్తున్నారని వారిపై జరిమానా విధించాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు.
ప్రతీ దుకాణాల ముందు మూడు డస్ట్ బిన్లు ఉండేలా చూడాలని, దుకాణాలలో నిషేదిత ప్లాస్టిక్ కవర్లు అమ్మిన యడల జరిమానా విధించాలని, యూజర్ చార్జీలు వసూలు చేయాలని ఆదేశించారు. ప్రతి సచివాలయాల పరిధిలో నూతనంగా నిర్మించిన ఇళ్ళు, ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయో వార్డు అడ్మిన్ కార్యదర్శిలు, శానిటరి కార్యదర్శిలు గుర్తించి వాటికి పన్నులు, ఖాళీ స్థలాలకు వి.ఎల్.టి. విధించాలని అదేశించారు. వచ్చే వారం నుండి ప్రతి సచివాలయ పరిధిలో డోర్ టు డోర్ సీజనల్ వ్యాధులు సర్వే జరపాలని, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా చూడాలని వెటర్నరి డాక్టరును ఆదేశించారు. సచివాలయ పరిధిలో స్పందనలో వచ్చిన దరఖాస్తులను, వివిధ పేపర్లు వచ్చిన క్లిప్పింగులపై స్పందించి వాటిని వెంట వెంటనే పరిష్కరించి ప్రజల మన్నలను పొందాలని, ఎటువంటి అలసత్వము ప్రదర్శించకూడదని కమిషనర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైధ్యాదికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, వెటర్నరి డాక్టరు కిషోర్, ఎఎంఒహెచ్ లు, శానిటరి సూపర్వైజర్లు, శానిటరి ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.