ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, పేదలందరికీ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతం చేసేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులు డివిజన్, మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కాంప్ కార్యాలయం నుండి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, పేదలందరికీ ఇళ్ళ పథకం, ఖరీఫ్ వ్యవసాయ పనులపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్తకలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఎఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం)తో కలిసి సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలకు ఇప్పటికే స్థలాలు కేటాయించిన గ్రామాలలో వెంటనే స్థలాలు సేకరించి సంబంధిత శాఖలకు అందించాలన్నారు. పట్టణ ప్రాంతాలలో అంగన్వాడీ కేంద్రాల భవనాలు నిర్మాణంకు అవసరమైన స్థలాలు సేకరించేలా కమిషనర్లు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రైతుభరోసా కేంద్రాలు, సచివాలయాల, భవనాల నిర్మాణ పనులు నాణ్యతతో రాజీ పడకుండా వేగంగా చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాలలో స్థలాలు కేటాయించిన అర్బన్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా రానున్న వారం రోజుల్లో జిల్లాలో 10 వేల ఇళ్ళ నిర్మాణం ప్రారంభించాలని లక్ష్యం నిర్దేశించినందున, దానికి అనుగుణంగా లే అవుట్లు వారీగా ఇళ్ళ నిర్మాణంకు లబ్ధిదారులను సిద్దం చేయాలన్నారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, జియోట్యాగింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ దరఖాస్తులను వెంటనే పరిష్కారించాన్నారు. అర్హత ఉన్న వారికి అనుగుణంగా స్థలాల సేకరణపై ప్రతిపాదనలు అందించాలన్నారు. ఖరీఫ్ పంటల సాగు కు అనుగుణంగా రైతుభరోసా కేంద్రాలలో విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. నాసిరక విత్తనాలు అమ్మకాలు జరగకుండా మండల స్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక టీంల ద్వారా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులు పురోగతి స్పష్టంగా కన్పించేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు అందించాలన్నారు.
సంయుక్త కలెక్టరు (రైతుభరోసా, రెవెన్యూ) ఎఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ
ప్రభుత్వ
భవనాల
నిర్మాణ
పనులను
సబ్ కలెక్టర్లు, రెవెన్యూ
డివిజన్ అధికారులు
పర్యవేక్షించాలన్నారు. బల్క్‌మిల్క్ చిల్లింగ్ యూనిట్లు, ఆటో
మిల్క్ కలెక్షన్ సెంటర్ల
నిర్మాణానికి, మల్టీపర్పస్ కేంద్రాల
నిర్మాణానికి
వెంటనే
స్థలాలు
కేటాయించేలా
చర్యలు
తీసుకోవాలన్నారు. ఖరీఫ్ వ్యవసాయ
పనులు
ప్రారంభమవుతున్నాందున
కౌలు
రైతులందరికీ
సీసీఆర్సీ
కార్డులు
జారీ
చేసేలా
చర్యలు
తీసుకోవాలన్నారు.
సంయుక్త కలెక్టరు(సచివాలయాలు, అభివృద్ధి) పి
ప్రశాంతి
మాట్లాడుతూ
పేదలందరికీ
ఇళ్ళ
పథకం
లబ్ధిదారులు
రిజిస్ట్రేషన్, జియోట్యాగింగ్ వెంటనే
పూర్తి
చేయాలన్నారు. రానున్న
వారం
రోజుల్లో
జిల్లాలో
10,000 ఇళ్ళ
నిర్మాణంకు
లే
అవుట్లు
వారీగా
నిర్దేశించిన
విధంగా
ఇళ్ళ
నిర్మాణం
చేపట్టేలా
చర్యలు
తీసుకోవాలన్నారు.