సింహగిరిపై ఈఓ సూర్యకళ సాహసం..
Ens Balu
5
Simhachalam
2021-06-01 13:44:27
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో ఈఓ ఆమె..చిటికేస్తే అధికారులు ఉరుకులు పరుగులపై వెళ్లి పనులు చేస్తారు..కానీ అవేమీ ఆ అధికారిణికి ఇష్టం వుండవు..తానే స్వయంగా వెళ్లి నిర్ధారిస్తే తప్పా చర్యలకు ఉపక్రమించరు..దానికోసం ఎలాంటి ప్రదేశాలనైనా నేరుగా సందర్శిస్తారు..అందులో భాగంగానే మంగళవారం ఈఓ సూర్యకళ సింహగిరిపై ఔరా అనేలా సాహసం చేశారు. మెట్ల మార్గంలోని ఆకాశధార, చాకిధార, హనుమంతధార, చక్రధార, శంకధార, పిచ్చుక ధార, వేగవతి ధారలను పరిశీలించారు. ఆ సమయంలో సుమారు 30 అడుగులకు పైనే వున్న ట్యాంకు నిచ్చెనను అలవోక గా ఎక్కి మరీ అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. భక్తులు ఇచ్చిన ఫిర్యాదులపై ఈఓ చేసిన సుడిగాలి తనిఖీలు అధికారులకు మెచ్చెటలు పట్టించాయి.. చక చకా కొండగుట్టలు ఎక్కేస్తూ..వాయు వేగంతో చేసిన పర్యటనలతో సిబ్బంది కంగారు పడ్డారు. అన్ని ప్రాంతాల్లోని సమస్యలను నిశితంగా పరిశీలించి అధికారులను సత్వరమే వాటి పరిష్కరించాలని ఆదేశించారు అంతేకాకుండా సహజసిద్దంగా వస్తున్న నీటిలో ఎన్నో ఔషద గుణాలు దాగి వున్నాయని అలాంటి మంచినీటిని వ్రుధా కాకుండా ఒడిసి పట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈరోజు ఎండలు చాలా అధికంగా ఉన్నప్పటికీ లెక్కచేయకుండా సింహాచలం దేవస్థానంలోని అన్ని ప్రధాన ప్రాంతాలను, మెట్లమార్గాన్ని తనిఖీలు చేశారు. ఒక మహిళా అధికారిణి చేసిన ఈ పర్యటన ఒక్కసారిగా సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది..