జూన్ 10 వరకూ జిల్లాలో కర్ఫ్యూ..
Ens Balu
4
Kakinada
2021-06-01 16:14:17
కోవిడ్-19 విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ప్రస్తుతం ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అమలవుతున్న కర్ఫ్యూను జూన్ 10 వరకు కొనసాగించనున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా కదలికలకు అనుమతించిన సమయంలోనూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అయిదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడకూడదని స్పష్టం చేశారు. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లకు, ఫార్మసీలతో పాటు అత్యవసర సర్వీసుల పంపిణీతో ముడిపడిన వాటికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.