జగనన్న ఇళ్లకు ఇసుక కొరత రాకూడదు..


Ens Balu
4
Guntakal
2021-06-01 16:23:39

అనంతపురం జిల్లాలో జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గుంతకల్లు పట్టణంలో నిర్మించనున్న అర్బన్ లే ఔట్ ను సందర్శించారు.  ఈనెల3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించనున్న సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గుంతకల్లుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అర్బన్ లే ఔట్ వద్ద నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు. 
లేఅవుట్ వద్ద మీడియా ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 2,23,000 మంది జగనన్న ఇళ్ల పట్టాలు పొందారని, వాటిలో 1,11,000 మంది ఇళ్ల నిర్మాణాలను పేజ్-1 లో చేపట్టనున్నామన్నారు. జూన్ 3న జిల్లాలో 8,000 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామన్నారు. గుంతకల్లు ఆర్బన్ లే అవుట్ లో 143 ఇళ్లకు పునాది వేయనున్నామని తెలిపారు. 
ఆరు నెలల్లోగా ఫేజ్-1 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పేజ్-1లో చేపట్టనున్న లక్షకు పైగా నిర్మాణాలకు కావాల్సిన ఇసుక, సిమెంట్, ఇతర సామగ్రి గురించి అంచనాలు సిద్ధం చేశామన్నారు. ఆ మేరకు సామాగ్రి కొరత రాకుండా చూసేందుకు ప్రణాళిక  చేపట్టడం జరిగిందని  తెలిపారు.
సొంతంగా ఇళ్లు నిర్మించుకునే వారికి 20 టన్నుల ఇసుక  శ్రీకారం చుడుతున్నారని్పు వరకూ నిర్మాణం సమయంలో 5 టన్నులు, ఇంటి ఫినిషింగ్ పనులకు మరో 5 టన్నులు ఇవ్వడం జరుగుతుందన్నారు. 
అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా జిల్లా వ్యాప్తంగా 1045 జగనన్న కాలనీలను ఏర్పాటు  శ్రీకారం చుడుతున్న మని తెలిపారు ఇప్పటికే నీటి వసతి కోసం బోర్లు వేయించామని, విశాల మైన రోడ్లు, పచ్చదనం మొక్కలు, ఆట స్థలం వంటి వసతులతో పాటు రెండు వేల పైన జనాభా లే ఔట్లలో ఉంటే పాఠశాలలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను కూడా మంజూరు చేయనున్నామన్నారు.
నూతన ఇసుక విధానం ద్వారా జిల్లాలో జేపీ గ్రూప్ ద్వారా ఇసుక తవ్వకాలు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఉన్న 18 ఇసుక రీచులకు అదనంగా రీచులకు అనుమతుల కోసం పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపామని, ఇసుక కొరత రానివ్వమని అన్నారు. 
రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం కోసం 53,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయనుందని, ఆ రకంగా కరోనా కష్టకాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం కానుందన్నారు.

ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్లు సిరి. నిశాంత్ కుమార్., ట్రైనింగ్ కలెక్టర్ సూర్య తేజ, ఆర్డీవో   గుణ భూషణ రెడ్డి. గుంతకల్ మున్సిపల్ కమిషనర్  బండి శేషన్న, హౌసింగ్ పీడీ చంద్రమౌళి ఈశ్వర్ రెడ్డి విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ వర కుమార్ ఆర్డబ్ల్యూఎస్, ఎమ్మార్వో రాము, మున్సిపల్ శాఖ ఇంజనీర్లు విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.,.