రేపు కోవిడ్ వేక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్..


Ens Balu
1
విశాఖ రూరల్
2021-06-01 16:28:33

విశాఖ జిల్లాలో బుధవారం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. ఉదయం 7 గంటల నుండి జిల్లా వ్యాప్తంగా 35 పి.హెచ్.సి.కేంద్రాలలో కోవాక్సిన్, కొవిషీల్డ్  వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందన్నారు. 25 కేంద్రాలలో కోవ్యాక్సిన్, 10 కేంద్రాలలో కొవిషీల్డ్   45 సంవత్సరాలు దాటిన వారికి వేస్తారని తెలిపారు.  గ్రామ సచివాలయ సెక్రటరీలు, వాలంటీర్లు వారి పరిధిలో ఉన్న అర్హులైన వారందరికీ వ్యాక్సిన్లు వేయించాలని ఆదేశించడం జరిగింది అన్నారు. మిగతా గ్రామీణ పిహెచ్ సిలు, గిరిజన ప్రాంతంలోని పి. హెచ్ సిలలో లభ్యత బట్టి వాక్సినేషన్ జరుగుతుందని. 45 సం. లు  దాటిన వారికి మాత్రమే వాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. కోవాక్సిన్ మొదటి రెండవ డోసులు కూడా వేస్తున్నారని పేర్కొన్న కలెక్టర్  కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు మాత్రమే వేస్తారని చెప్పారు.  జిల్లాలో ఇంకా  వ్యాక్సిన్ వేయించుకోని వారు   ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.