విజయనగరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు పాఠ్యపుస్తకాలు సిద్దమయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది సుమారు 26లక్షాల, 66వేల, 378 పుస్తకాలు అవసరమని అంచనా. కాగా వీటిలో మొదటి విడతగా 5లక్షల, ఒక వెయ్యి, 471 పుస్తకాలు వచ్చాయి. వీటిని ఆయా ప్రాంతాల్లోని గోదాముల్లో భద్రపరిచారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి తెలిపారు. కరోనా కేసుల ద్రుష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకొని విద్యార్ధులందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు డిఈఓ తెలియజేశారు.