ఆర్ కార్డు నిర్వాసితుల పాలిట ఆపద్భాందవుడై...


Ens Balu
5
Gajuwaka
2020-08-30 15:06:23

విశాఖ స్టీలుప్లాంట్ నిర్వాసితుల సమస్యలను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తిస్థాయిలో తీర్చేయాలని కంకణం కట్టుకున్నారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఎంత కాలం ఉన్నామన్నది కాదు ప్రజలకు ఏ స్థాయిలో సహాయం చేశామన్నదే ముఖ్యమనే విధంగా పట్టిన పట్టు విడవకుండా స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డు బదిలీ కార్యక్ర మం జరిగేలా చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. స్టీలు ప్లాంటు ఏర్పడిన తరువాత చాలా మంది ఆర్ కార్డు దారుల, తమ కార్డులు బదిలీ జరగగక, ఉపాది దొర కక చాలా నష్టపోయారు. మిగిలివున్న కొద్దిమంది కష్టాలైనా తీర్చాలనే ఉద్ధేశ్యంతో ఎమ్మెల్యే తిప్పల చేస్తున్న ప్రయత్నాలు ముందడుగు పడుతున్నాయనే చెప్పాలి. ఆర్ కార్డు నిర్వాసితుల సమస్యలను తీర్చాలని జెసి ని కలిసిన తరువాతన ఈ విషయాన్ని నేరుగా సీఎం వైఎస్ జగన్మోనరెడ్డి దగ్గరకు తీసుకెళ్లి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసేలా చూడాలన్నది ఆయన ప్రయత్నం. అదే జరిగితే స్టీలు ప్లాంటుకి భూములు ఇచ్చి ఎలాంటి ఉపాది, ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉండిపోయిన ఆర్ కార్డు నిర్వాసితులు తమ కార్డులను బదిలీచేసుకునే అవకాశం వస్తుంది. దీంతో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అది జరిగి విశాఖజిల్లాలో ఏ ఎమ్మెల్యే పరిష్కరించని ప్రధాన సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేగా తిప్పలనాగిరెడ్డి చరిత్ర స్రుష్టించిన వారవుతారు. అందులోనూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా మంచి కార్యక్రమం చేయాలన్న తలపుంతో చేపట్టిన ఈ అంశంలో అధికారులు స్పందిస్తే...ఈ పని ఆరు నెలల్లో పూర్తయిపోతుంది...తద్వారా ఎన్నో ఏళ్ల నుంచి అరిష్క్రుతంగా ఉన్న సమస్య కూడా పరిష్కారం అవుతుందని నిర్వాసితులు పేర్కొంటున్నారు.