విజయనగరం పట్టణ పేదరిక నిర్మూళనా సంస్థ (మెప్మా) ప్రాజెక్టు డైరెక్టర్‌గా బి.సుధాకరరావు బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం డుమా ఏపిడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా, 104 కాల్ సెంటర్ ఇన్‌ఛార్జిగా కూడా కమాండ్ కంట్రోల్ రూములో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వరకూ మెప్మా పిడిగా అదనపు బాధ్యతలు నిర్వహించిన కె.సుగుణాకరరావు, ఆ బాధ్యతలనుంచి తప్పుకోవడంతో, సుధాకరరావును ఇన్‌ఛార్జిగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సుధాకర్‌ను పలువురు అధికారులు, సిబ్బంది అభినందించారు.