అప్పన్న హుండీ ఆదాయం రూ. 32.42 లక్షలు..


Ens Balu
3
Simhachalam
2021-06-02 12:59:43

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీ లెక్కింపులో 32లక్షల 42వేల 439  రూపాయల ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియ జేశారు. ఈ మేరకు దేవస్థానంలో ఆమె మీడియాలో మాట్లాడారు. కోవిడ్ నిబంధన లతో దేవస్థానంలో మూడు హుండీలను లెక్కింపు చేపట్టినట్టు చెప్పారు. ఉన్న సిబ్బంది తోనే  మధ్యాహ్నం 12:00 గంటల వరకు లెక్కింపు చేపట్టినట్టు వివరించారు. మిగతా హుండీల లెక్కింపు తేదీని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.  దేవస్ధాన అధికారులు, ట్రస్టు బోర్డు సభ్యుల పర్యవేక్షలో కౌంటింగ్ జరిగిందని వివరించారు. నగదుతోపాటు 70 యూరోలు, 20 డాలర్లుకూడా హుండీల్లో స్వామికి వచ్చాయని చెప్పారు.