స్వామి సేవలన్నీ కళ్యాణమండపంలోనే..


Ens Balu
1
Simhachalam
2021-06-02 13:05:42

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో  స్వామివారికి ఆదివారం, గురువారం, ఏకాదశినాడు తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ సహస్రనామం, అష్టత్తరాలతను కళ్యాణ మండపంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు దేవస్థానంలోని అర్చకులు, ప్రధాన సిబ్బందితో ఆమే సమావేశం అయి పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్వామి సేవల్లో పాల్గొన్నవారికి లైవ్ లింక్ ప్రత్యేకంగా పంపించాలని నిర్ణయించారు.  శుక్రవారం నుంచే ఈ సేవలు ప్రారంభంకానున్నాయని చెప్పిన ఈఓ.. కోవిడ్ 19 సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఈసమయంలో  స్వామిని మరింత నిశితంగా చూసేందుకు భక్తులకు అవకాశం కలుగుతోంది.  సహస్రనామాలు ఉదయం 7:00 నుంచి 8:00 గంటల వరకు , అష్టోత్తరం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, గురువారం, ఆదివారం, ఏకాదశినాడు వేరే సేవలున్న రోజుల్లో  సహస్రనామాలు, అష్టోత్తరాలుండవుని ఈఓ వివరించారు..