ఉద్యోగస్తుల కోసం ఇళ్ల స్థలాల పరిశీలన..
Ens Balu
2
Rajahmundry
2021-06-02 13:12:50
ప్రభుత్వంలోని మధ్యతరగతి ఉద్యోగులకు ఎమ్ ఐ జి స్కీమ్ లో ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు రాజమండ్రి నగరపాలక సంస్థ కమీషనర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. బుధవారం ఈ మేరకు వెలుగుబంద,తొర్రేడు, రాజవోలు తదితర ప్రాంతాల్లో లభ్యత లో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. అర్హులైన వారికి నిర్దేదించిన మార్గదర్శకాలను అనుసరించి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈ పర్యటనలో కమీషనర్ వెంట సిటీ ప్లానర్ ప్రసాద్, రాజనగరం,రూరల్ మండల తహసీల్దార్ లు పాల్గొన్నారు.