విద్యార్డులకు డ్రై రేషన్ సరుకులు పంపిణీ..
Ens Balu
3
కాకినాడ
2021-06-02 13:38:48
జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా పాఠశాలల విద్యార్డులకు డ్రై రేషన్ గా కందిపప్పుపంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి బుధవారం ఉదయం కలెక్టరేట్ లో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా మధ్యాహ్న బోజన పధకం అమల చేస్తున్న పాఠశాలల విద్యార్డులకు సెప్టెంబర్ 2020 నుండి జనవరి 2021 నెలల మధ్య కాలములో 100 రోజులు పనిదినములుగా లెక్కించి డ్రై రేషన్ గా కందిపప్పును జగనన్న గోరుముద్ద (MDM) పథకంలో భాగంగా డ్రై రేషన్ గా ఈ నెల 2వ తేదీ నుండి సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం క్రింద ప్రాధమిక పాఠశాలల విద్యార్థులకు 4.5 KGలు, ప్రాధమికోన్నత/ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 6.5KGలు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యా శాఖాధికారి మాట్లాడుతూ కందిపప్పు సరఫరా చేసేవారు వచ్చినప్పుడు ఆయా పాఠశాలల ప్రధానోపథ్యాయులు/ఉపాధ్యాయులు వచ్చి తీసుకుని, వెంటనే IMMS యాప్ నందు నమోదు చేయాలని తెలిపారు. అలాగే కందిపప్పును విద్యార్థులు/తల్లిదండ్రులకు పంపిణీ చేసిన తరువాత కూడా వివరాలు IMMS యాప్ నందు నమోదు చేయాలన్నారు. ఈ డ్రై రేషన్ పంపిణీ చేసేపుడు కోవిడ్-19 నిబంధనలను, జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని డిఈఓ కోరారు.