నాడు - నేడు పాఠశాలల అభివృద్థి పనులు ఈ నెల 25వ తేదీలోగా నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నాడు - నేడు పాఠశాలల అభివృద్థి పనులపై సంబంధి త అధి కారులతో గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో సమావేశం ఆయన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పాఠశాలల అభివృద్థి కార్యక్రమాలలో ఎదురైన సాంకేతిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిర్మాణ పనులు అధికశాతం పూర్తయినప్పటికి సాంకేతిక సమస్యలతో బిల్లుల చెల్లింపులు నిలిచాయన్నారు. వాటిని తక్షణమే అందజేయాలన్నారు. పాఠశాలల అభివృద్థి కమిటి, తల్లిదండ్రుల కమిటీల ఆధ్వర్యంలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. మొదటిదశలో 1,348 పాఠశాలల్లో అభివృద్థి కార్యక్రమాలు జరిగాయన్నారు. అదనంగా మరో 40పాఠశాలలను అభివృద్థి చేసినట్లు వివరించారు. జిల్లాలో రూ. 329 కోట్ల నిధులతో మరుగుదొడ్ల నిర్మాణం, అదనపు తరగతి గదులు, విద్యుద్దీకరణ, త్రాగునీటి వసతి, ఆధునీక ఉపకరణాల ఏర్పాటు, మరమ్మతు పనులు చేపట్టారని ఆయన వివరించారు. ఏ.పి.ఇ.డబ్ల్యు.ఐ.డి.సి., ఇంజినీరింగ్ విభాగం ద్వారా 157 పాఠశాలల్లో రూ.90.06 కోట్ల నిధ ులతో 80.3
శాతం పనులు చేపట్టారని ఆయన తెలిపారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా 45 పాఠశాలలో
రూ. 11.01 కోట్లతో 95.4 శాతం పనులు జరిగాయన్నారు. పంచాయతీ రాజ్ ద్వారా 648 పాఠశాలల్లో
రూ.55.8 కోట్లతో 55.9 శాతం పనులు జరిగాయన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా 498 పాఠశాలల్లో
రూ. 66.8 కోట్ల నిధులతో 64.4 శాతం పనులు జరిగాయన్నారు. ఆయా పాఠశాలల్లో 19,482 కంప్యూటర్లు
జిల్లాకు వచ్చాయన్నారు. 1,627 మేజర్ , మైనర్ పనులు పూర్తి చెయ్యాల్సి ఉండగా ప్రస్తుతం 1,310
పనులు పూర్తయ్యాయన్నారు.
పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం
కల్పించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకోవడానికి అవసరమైన
పరిస్థితులు కల్పించాలని ఆయన పలు సూచనలు చేశారు. నాడు - నేడు పాఠశాలల అభివృద్థిలో
భాగంగా రెండవ విడతలో జిల్లాలో 1,309 పాఠశాలలను ఎంపికి చేసి ప్రభుత్వం జాబితా విడుదల
చేసిందన్నారు. 805 ప్రాధమిక పాఠశాలలు, 51 ప్రాధమికోన్నత పాఠశాలలు, 194 ఉన్నత పాఠశాలలు,
31 జూనియర్ కాలేజీలు, 135 ప్రభుత్వ వసతి గృహాలు, ఒక డైట్ కళాశాల, 56 ఎం.ఆర్.సి.ఎస్.
భవనాలు, 36 భవిత సెంటర్లను ఎంపిక చేసిందన్నారు. మొదటివిడతలో అభివృద్థి పనులు చేపట్టిన
ఇంజినీరింగ్ అధికారులు రెండవ విడతలోనూ ప్రారంభించాల్సి ఉందన్నారు. ఇంజినీర్లు ముందస్తు
పరిశీలన చేసి అంచనాలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఇంజినీర్లు క్షేత్రస్థాయి పరిశీలన
తప్పనిసరిగా చెయ్యాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్థి) టి.ఎస్.చేతన్, డి.ఇ.ఓ.
వి.ఎస్.సుబ్బారావు, సమగ్ర శిక్షా అభియాన్ ఏ.పి.సి. శ్రీనివాసరెడ్డి, పి.ఆర్. ఎస్.ఇ. కొండయ్య,
ప్రజారోగ్య విభాగం జిల్లా కో ఆర్డినేటర్ సుంద రరామి రెడ్డి, ఏ.పి.ఇ.డబ్ల్యు.ఐ.డి.సి. డి.ఇ. పి.భాస్కరబాబు
తదితరులు పాల్గొన్నారు.