ఆమె ఆదేశించే అధికారిణికాదు..ఆపదసమయంలో రక్షణగా నిలిచే అధికారిణి.. నా అనేవారు లేనివారికి సేవలందించడమే కాదు..తన వద్ద పనిచేసే సిబ్బందికి సరైన సమయంలో చేయూత నిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు..ఆమె ఎవరోకాదు విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి.. అవును మీరు చదువుతున్నది నిజమే.. కరోనా సమయంలో సిబ్బంది కరోనా వైరస్ భారిన పడకుండా ఈ అధికారిణి చేస్తున్న నిశ్వార్ధ సేవ ఇపుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.. ఇంటింటీకి రేషన్ సరుకులు పంపిణీ చేసే సమయంలో సంచార బియ్యం పంపిణీ సిబ్బంది కరోనా భారిన పడకుండా వారికి తన సొంత నిధులతో సేఫ్టీ కిట్ లను వితరణ చేశారు..అంతేకాదు ప్రభుత్వం వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించడంతో జాయింట్ కలెక్టర్ సహాయంతో వారందరికీ పంపిణీ కార్యక్రమానికి రెండు రోజులు ముందుగానే దగ్గరుండి కరోనా టీకాలు వేయించారు..ఆపై ప్రజల్లో తిరిగే సమయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాలంటూ సిబ్బంది మొత్తానికి జాగ్రత్తలు చెప్పి బియ్యం పంపిణీకి వెళ్లే సమయంలో అందరికీ హేండ్ గ్లౌజ్ లు, శానిటైజర్లు, ఫేస్ మాస్కు కిట్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా వైరస్ కేసులు అధికంగా వున్నసమయంలో ప్రజలకు నిరంతరం సేవలందించాలంటే అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఇలాంటి సందర్భంలో ఎందరో దాతలు ముందుకు వచ్చి చేస్తున్న సేవలు తనను ఎంతగానో ఆలోచింపచేశాయని, దీనితో రెండు దఫాలుగా మొబైల్ డిస్ట్రిబ్యూషన్ సిబ్బంది తన వంతుగా సహాయం చేశానన్నారు. ఎల్లప్పుడూ తనదైన రీతిలో సేవలు అందించే విశాఖలోని అర్భన్ తహశీల్దార్ సేవలను ఇటు అధికారులు, అటు సామాజిక వేత్తలు ఎంతగానో అభినందిస్తున్నారు..మంచి అధికారులు ఈ విధంగా సేవలు చేయడానికి ముందుకొస్తే కరోనా సమయంలో ఎంతో మేలు జరుగుతుందంటూ కితాబునిస్తున్నారు.. ప్రార్ధించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అనే పదాలను అమలు చేస్తున్న ఈ అధికారిణి సేవలు మరింతగా ఆపన్నులకు అందాలని ఆశిద్ధాం..!