విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలోని చారిత్రక శిల్ప సంపదను భక్తులకు తెలియజేసే వినూత్న కార్యక్రమానికి ఈఓ ఎంవీ సూర్యకళ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా స్వామివారి ఆలయంలోని కళ్యాణ మండపంలోని శిల్పాలను మరింతగా కనిపించేలా వాటిని శుభ్రపరిస్తున్నారు. ఇక్కడి రాతి స్థంబాలపై వున్న అపురూప, దైవ శిల్పాలు కనిపించేలా వాటిని చక్కగా తైలంతో శుభ్రం చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని వినియోగించి భక్తులకు వాటిని బాగా కనిపించేలా చర్యలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఈఓ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. సింహాచల ఆలయ ఈఓగా చేసిన ఏ ఒక్కరూ చేయని ఈపని చేసి స్వామివారి ఆలయంలో వున్న ఏళ్ల కాలం నాటి శిల్ప కళ భక్తులు తిలకించే విధంగా తీసుకున్న ఈఓ సూర్యకళ చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ రోజుచేపట్టిన ఈ పరిశుభ్రత కార్యక్రమంలో ఈఓతో పాటు ఏఈఓ రాఘవకుమార్, స్థానాచార్యులు పాల్గొన్నారు. అంతకు ముందు శుభ్రం చేసిన శిల్పాలను ఈఓ దగ్గరుంచి పరిశీలించారు.