జగనన్న కాలనీలతో మరో అనంతను నిర్మాస్తున్నాం..


Ens Balu
2
Guntakal
2021-06-03 14:18:49

జగనన్న ఇళ్ల నిర్మాణం ద్వారా జిల్లాలో మరో అనంతను నిర్మించనున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. జిల్లాలో 1044 గ్రామ పంచాయితీలు ఉండగా 1045 జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామని.. అంటే మరో ఆనంతను నిర్మిస్తున్నామని కలెక్టర్ వివరించారు. పట్టణ శివారు ప్రాంతంలోని ధోని ముక్కల లేఅవుట్ లో నిర్వహించిన జగనన్న కాలనీల గృహ నిర్మాణ ప్రారంభ మహోత్సవ వేడుకలలో జిల్లా గంధం చంద్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ విషయంలో పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తాయని జిల్లాలో మాత్రం సమస్యలు లేకుండా భూ సేకరణ చేపట్టామన్నారు. రెవెన్యూ యంత్రాంగం కృషితో వివాదాస్పదం కాని భూమిని సేకరించడం, భూ హక్కుదారులకు మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించి సమస్యలను నివారించామన్నారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ద్వారా జిల్లాలో దాదాపు 25 శాతం మంది లబ్ది పొందనున్నారన్నారు. మరెంతో మందికి ఉపాధి దక్కనుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు 15 శాతంతో సమానమైన మొత్తాన్ని మొదటి విడత ఇళ్ల నిర్మాణాలకు కేటాయించడం అంటే ఈ కార్యక్రమం యొక్క భారీ తనాన్ని అర్థం చేసుకోవలన్నారు. ఒకప్పుడు అమెరికాలో ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు పేదలతో ఏదో ఒక పని చేయించి వారికి డబ్బులు అందించారని, మళ్లీ నేడు కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉపయోగ పడే ఇళ్ల నిర్మాణాల పనుల ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.