కరోనా మహమ్మారి పీడలు సమసిపోయేలా శ్రీశ్రీశ్రీ కనకమహా లక్ష్మి అమ్మవారు సమస్త జీవకోటిని కరుణించాలని తల్లిని వేడుకున్నట్టు సింహాచలం ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్లశ్రీనుబాబు చెప్పారు. శుక్రవారం హనుత్ జయంతి, ఏకాదశిని పురస్కరించుకొని విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో దేవాదాయశాఖ ఆలయాల్లో యజ్ఞయాగాదులు చేపట్టడం ప్రశంసనీయమని కొనియాడారు. భక్తులకు ఎలాటి ఇబ్బందులు లేకుండా ఆన్ లైన్ లో దర్శనాలు ప్రత్యేక సేవలు కల్పిస్తుందన్నారు.కరోనా వైరస్ నియంత్రణ జరిగి ప్రజలు సాధారణ జీవితం గడపాలన్నదే తన అబిమతమన్నారు. అంతకుముంద జివిఎంసీదుర్గాదేవి, తాటిచెట్లపాలెం అభయాంజనేయ స్వామి ఆలయాల్లో శ్రీనుబాబు ప్రత్యేకంగా పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. సమాజాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని తాను అమ్మ వార్లు,
స్వామి ని కోరుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే అనేక చోట్ల ధన్వంతరి హోమాలు,
యజ్ఞాలలో పాల్గొని పూజలు కూడాచేపట్టినట్టు గంట్ల వివరించారు.