కోవిడ్ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో సామాజిక బాధ్యతగా తూర్పుగోదావరి జిల్లా ఆక్వా రైతుల అసోసియేషన్ కోవిడ్ సహాయనిధికి రూ.31,76,000 విరాళంగా అందించింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో సంఘం ప్రతినిధులు కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తు సమయంలో ప్రజలకు వైద్య, ఇతర సేవలు అందించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యమవుతూ విరాళం అందించిన తూర్పుగోదావరి జిల్లా ఆక్వా రైతుల అసోసియేషన్‌కు అభినందలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో అహర్నిశలూ కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ్యులు, కలెక్టర్, ఎస్‌పీ, ప్రభుత్వ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్ జేడీ పీవీ సత్యనారాయణ, ఆక్వా రైతు సంఘం ప్రతినిధులు సీహెచ్‌వీ సూర్యారావు, కుర్రా రఘు, వి.రాంబాబు, ఎం.సతీస్‌రాజు, పేరా బత్తులరాజశేఖర్, బుల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.