రూ.28.లక్షల ఆక్సిజన్ మిషన్లు వితరణ..
Ens Balu
2
Kakinada
2021-06-04 13:38:55
అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్, పేటీఎం ఫౌండేషన్ సంయుక్తంగా తూర్పుగోదావరి జిల్లాకు దాదాపు రూ.26 లక్షల విలువైన 38 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చాయి. ఈ మేరకు అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్, పేటీఎం ఫౌండేషన్ ప్రతినిధులు శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. కోవిడ్ బాధితులకు అవసరమైన ప్రాణ వాయువును అందించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూర్చిన అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్, పేటీఎం ఫౌండేషన్‌లకు కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. కోవిడ్ విపత్తు సమయంలో బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తమ వంతు సహాయంగా కాన్సంట్రేటర్లను అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ (డీ) కీర్తి చేకూరి, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్ ప్రతినిధి, స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.