నూతన్ నాయుడుని అరెస్టు చేయాల్సిందే..సిపిఎం


Ens Balu
3
డాబాగార్డెన్స్
2020-08-30 18:59:13

విశాఖలోని పెందుర్తిలో ఈ నెల 27న దళితయువకుడైన కర్రి శ్రీకాంత్‌కు శిరోముండనం  చేయించిన నూతన్‌నాయుడుని తక్షణమే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీకాంత్‌కు తగిన న్యాయం చేయాలని, నూతన్నాయుడుని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం  డాబాగార్డెన్స్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ, ఒక దళితయువకుడిపై సెలబ్రిటీ, సినీనిర్మాత నూతన్‌నాయుడు కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. ఈయన జనసేన పార్టీ నాయకుడునని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. దళితులైన ఇంత దారుణంగా వివక్షపూరితంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినెట్లు వ్యవహించి అసలై దోషులను వదిలేయడం సరికాదన్నారు. ఇంటి యజమాని అయిన నూతన్‌నాయుడుపై ఎటువంటి కేసులేకుండా, అరెస్టు చేయకుండా కేసును పక్కదారి పట్టించడం తప్ప మరొకటి కాదు.  శిరోముండనంతో అవమానపడిన దళిత బాధితుడికి చట్ట ప్రకారం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇచ్చి ఆ కుటుంబానికి ఎటువంటి ప్రాణ నష్టం కలుగకుండా రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేసారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, బి.జగన్‌, నాయకులు ఎం.సుబ్బారావు, చంద్రమౌళి, చంటి, కుమారి, వెంకటరావు, చంద్రశేఖర్‌, ఎస్‌.ఎఫ్‌.ఐ నాయ‌కురాలు ఎల్‌.చిన్నా‌రి,  కెవిపిఎస్‌ నాయకులు సుబ్బన్న, జ్యోతి, ఆదిలక్ష్మి, రమ, లలిత తదితరులు పాల్గొన్నారు.