పన్ను నవీకరణలపై సూచనలివ్వండి..
Ens Balu
2
GVMC office
2021-06-04 14:10:52
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని కొత్తగా వేసే పన్నులపై ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్నట్టు కమిషనర్ డా.జి.స్రిజన తెలియజేశారు. ఈమేరకు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం 1955 ప్రకారము తేది.24.11.2020న జారి చేసిన జి.ఓ.ఎం.ఎస్.నెం.198లోని “ఆస్థి పన్ను విధింపు నియమాలు –2020” ననుసరించి, ఆస్తుల క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ నిర్ణయించిన భవనాలు, వాటి స్థలముల “మూలధన విలువల” ఆధారముగా తేది.01.04.2021 నుండి ఆస్థి పన్ను విధించుటకు నిర్ణయించి, నివాస భవనముల “మూలధన విలువ” మొత్తమునకు 0.15% మరియు నివాసేతర భవనముల “మూలధన విలువ” మొత్తముపై 0.30% , ఖాళీ స్థలముల “మూలధన విలువ” మొత్తముపై 0.50% విధించుటకు కార్పోరేషన్ తరపున ప్రతిపాదించామని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలు, Email:- revenuegvmc@gmail.com కి మెయిల్ చేయాల్సిందిగా కోరారు.