ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేదల ఆరోగ్య పరిరక్షణకి పెద్ద పీట వేస్తున్నారని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. శుక్రవారం అనకాపల్లి జోన్ లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు ఆమె ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్, ఎంపీ బివి సత్యవతిలతో కలసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సీఎం హెల్త్ సెంటర్స్ ద్వారా మెరుగైన ప్రాధమిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పధకం క్రింద అనేక జబ్బులకు ఉచితంగా కార్పోరేట్ వైద్యం అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పాదయాత్రలో ఇచ్చిన హామీలు 90శాతం నేరవేర్చిన సీఎం వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. ఎంపీ మాట్లాడుతూ, అనకాపల్లిలో రెండు ఆసుపత్రులు ఒక్కొక్కటి రూ.80లక్షల వ్యయంతో ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. ఈ రెండు ఆసుపత్రులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని జివిఎంసి ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ మేయర్ జియ్యని శ్రీధర్, కార్పొరేటర్ ఎం. చినతల్లి, 84వ వార్డు వై.సి.పి. ఇంచార్జ్ పలక రవి, పర్యవేక్షక ఇంజినీరు రాజా రావు, కార్యనిర్వాహక ఇంజినీరు మత్స్యరాజు, జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.