సుందర నగరంగా మన ఒంగోలు..
Ens Balu
2
Ongole
2021-06-04 15:33:33
మన ఒంగోలు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యుత్, అటవీ శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని 2.93 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఒంగోలు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆమలు చేయడానికి ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఒంగోలు నుండి కొప్పోలు రహదారిలో97లక్షల రూపాయల తో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. అలాగే గుంటూరు రోడ్లు లో మరియు కర్నూలు రోడ్డు లో 1.96కోట్ల రూపాయల తో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందనిఆయన అన్నారు.ఒంగోలు నగరంలో కోవిడ్ వల్ల అభివృద్ధి పనులు జ్యా పము జరుగుతుందన్నారు. త్వరలో ఒంగోలు నగరం లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు. కోవిడ్ నియంత్రణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కారంచేడు ప్రభుత్వ వైద్యులు ఆరోగ్యం కాపాడటానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వ వైద్యులు ఊపితిత్తులు మార్పిడి కోసం అయ్యే ఖర్చు1.5కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్.ఎన్. పాడు ఎమ్మెల్యే టి.జె.ఆర్.సుధాకర్ బాబు, ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీవ్ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి, ఇ.ఇ సుందర్ రామిరెడ్డి, వై.సి.పి నాయకులు ఐ.ఘన శ్యామ్, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్ రావు,తదితరులు పాల్గొన్నారు.