శిరోముండనం బాధితుడికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం..మంత్రి


Ens Balu
3
సుజాతనగర్
2020-08-30 19:45:35

విశాఖ జిల్లా  సుజాత నగర్ లో శిరోముండనం భాదితుడు శ్రీకాంత్, కుటుంబసభ్యులను  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు , స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు ఆదివారం పరామర్శించారు. అనంతరం సంఘటన ఎలా జరిగింది బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, బాధితుడు శ్రీకాంత్ ను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే , బాధితుడీకి 50 వేల  రూపాయలు ఆర్ధిక సహా యం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంతో మాట్లాడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకోవడంతోపాటు, ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు వచ్చే విధంగా చేస్తామన్నారు. దళితులపై ఇలాంటి సంఘటనలు జరగడం దారుణమన్న మంత్రి సెల్ ఫోను పోయిందనే నెపంతో శిరోముండనం చేయడంతోపాటు, దారుణం కొట్టడం బాధకలిగించిందన్నారు. అయినా దోషులను 24 గంటల్లోనే పట్టుకొని కేసులు పెట్టామన్నారు. ఇలాంటి సంఘటనలను  సీరియస్ గానే ప్రభుత్వం తీసుకుంటుందన్న ఇలాంటి విషయాల్లో అవతలి వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, ఈ ప్రాంతంపై పోలీసు నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విశాఖ మహానగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, వార్డు అధ్యక్ష కార్యర్శిలు, కార్యకర్తలు  పాల్గొన్నారు.