జూన్ 8న డిడిఆర్సీ సమావేశం..
Ens Balu
2
విజయనగరం
2021-06-05 11:58:39
విజయనగరం జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశం జూన్ 8వ తేదీన ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పాల్గొంటారని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఈ సమావేశంలో చర్చిస్తారని వెల్లడించారు.