రోడ్డు వెడల్పు అంచనాలు సమర్పించాలి..


Ens Balu
2
చినముషిడివాడ
2021-06-05 12:33:29

విశాఖ జీవిఎంసీ పరిధిలోని చిన్నముషిడివాడ ప్రధాన రహదారి (శారదా పీఠం రోడ్డు) వెడల్పునకు అంచనాలను తయారుచేసి కౌన్సిల్ ఆమోదానికి పంపాలని కమిషనర్ డా.జి.స్రిజన ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని 8వజోన్ పరిధిలోని చిన్న ముషిడివాడ తదితర ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చాలని అధికారులను ఆదేశించారు. చిన్న ముషిడివాడ మెయిన్ రోడ్డులో ఉన్న పార్కును అభివృద్ధి చేయాలని, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆమె మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెట్లను పెంచి పచ్చదనాన్ని పెంపొందించాలని, నిషేదిత ప్లాస్టిక్ ను విడనాడాలని, వర్షపు నీటిని ఆదా చేయాలని కమిషనర్ తెలిపారు. అనంతరం రూ.1.12కోట్ల వ్యయంతో సత్య నగర్ పార్కును అభివృద్ధి పరచాలని, దీనిని ఆగస్టు నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రూ.48 లక్షల వ్యయంతో సత్యనగర్ లో ప్రధాన కాలువలను మరమత్తులు చేపట్టుటకు కౌన్సిల్ ఆమోదం కొరకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. పులగాని పాలెం 40 అడుగుల రోడ్డు విస్తరణ కొరకు అంచనాలను తయారు చేసి కౌన్సిల్ ఆమోదం కొరకు పంపాలని కమిషనర్ ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సేనాపతి వసంత, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, పర్యవేక్షక ఇంజినీరు రాజారావు, జోనల్ కమిషనర్ చక్రవర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధుకుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్ (మెకానికల్) చిరంజీవి, ఎఎంఒహెచ్ లక్ష్మి తులసి, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.