కోవిడ్ యోధులకు రూ.50లక్షలు భీమా..
Ens Balu
1
Kakinada
2021-06-05 12:37:53
కోవిడ్19 పోరాట యోధులుగా సేవలు అందిస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పాకేజి ఇన్స్యూరెన్స్ పధకం క్రింద 50 లక్షల భీమా కవరేజి కల్పించిందని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి తెలియజేశారు. ఈ పధకం క్రింద కమ్యూనిటీ హెల్త్ కేర్ వర్కర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలోను, ప్రభుత్వ నోటిఫైడ్ ప్రయివేట్ ఆసుపత్రులలోను కోవిడ్ సేవల కొరకు కాంట్రాక్ట్, డైలీ వేజ్, అడ్ హాక్, ఆవుట్ సోర్స్, రిటైర్డ్, ఆశా కార్యకర్తలు, లోకల్ బాడీ తదితర పద్దతులలో నియమితులై కోవిడ్ రోగులకు డైరక్ట్ కాంటాక్ట్ తో ఆరోగ్య సేవలు అందింస్తూ దురదృష్టవశాత్తు కోవిడ్ సోకి, లేదా కోవిడ్ సేవలు అందిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన హెల్త్ కేర్ వర్కర్ల కుటుంబాలకు 50 లక్షల భీమా సహాయాన్ని అందజేస్తారన్నారు. ఈ పధకానికి భీమా ఎన్ రోల్ మెంట్ అవసరం లేదని, ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అలాగే వయో పరిమితి కూడా లేదని, ఏ ఇతర ఇన్య్సూరెన్స్ కవరేజిలు ఉన్నా ఈ పధకం క్లెయిమ్ అదనంగా చెల్లిస్తారని తెలిపారు. మార్చి 2020 నుండి న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా అమలు చేస్తున్న ఈ పధకాన్ని మరో ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించిందన్నారు. జిల్లాలో కోవిడ్ పోరాట యోధులుగా నిరుపమాన సేవలు అందిస్తూ చనిపోయిన హెల్త్ కేర్ వర్కర్ల కుటుంబ సభ్యులు పధకం క్రింద బీమా క్లెయిమ్ కొరకు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఫారమ్, మృతుడు, క్లెయిమెంట్ ల ఐడెంటీ రుజువులు, వారి రిలేషన్ షిప్ రుజువు, కోవిడ్ పాజిటీవ్ గా నిర్థారణ జరిగిన లాబ్ టెస్ట్( ICMR/HRCT) రిపోర్ట్, చనిపోయిన ఆసుపత్రి నుండి డెత్ సమ్మరీ, మృతుడు పనిచేసిన ఆసుపత్రి, సంస్థ నుండి కోవిడ్ విధులపై పనిచేసిన ధృవీకరణల సర్టిఫైడ్ కాపీలు, అఫాడవిట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఓరిజినల్ డెత్ సర్టిఫికేట్ వివరాలతో డియంహెచ్ కార్యాలయంలో ఐడిఎస్పి సెల్ అధికారి డిస్ట్రిక్ ఎపిడెమియోలజిస్ట్ డా.రవికుమార్ ను సంప్రదించాలని కోరారు. కోవిడ్ విధుల నిర్వహణలో ప్రమాద వశాత్తు సంభవించిన సందర్భంలో లాబ్ రిపోర్ట్ బదులు పోస్ట్ మార్టమ్, ఎఫ్ఐఆర్ ల సర్టిఫైడ్ కాపీలు సమర్పించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 8 గురు కోవిడ్ పోరాట యోధులకు ఈ పధకం ద్వారా భీమా సహాయాలను క్లెయియ్ చేయడం జరిగిందని జేసి(డి) తెలియజేశారు.