విద్య, ఉద్యోగం, ఇతర అత్యవసర కారణాలపై విదేశాలకు వెళ్లవలసిన 18- 45 సంవత్సరాల వయస్కుల వారికి శనివారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజిలో నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ శిభిరంలో 137 మందికి కోవిషీల్డ్ టీకాలు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేశారు. ఇంకా జిల్లాలో విదేశాలకు వెళ్లవసిన 18 నుంచి 45 ఏళ్ల వయస్సు వారేవరైనా ఉంటే మరో మారు ఇటువంటి ప్రత్యేక శిభిరం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు తమ వివరాలను, డాక్యుమెంటరీ రుజువుల పత్రాలతో డియంహెచ్ఓ కార్యాలయం 3వ ఫ్లోర్ లోని కోవిడ్ వాక్సినేషన్ సెల్ లో ఉదయం 10 గం.ల నుండి మద్యాహ్నం 2 గం.ల వరకూ అందుబాటులో ఉండే అధికారి ఎ.హేమలత ను వ్యక్తిగతంగా సంప్రతించాలని తెలియజేశారు. అభ్యర్థులు తమ పేరు, అడ్రస్, ఆధార్ నెంబరు,పాస్ పోర్ట్, ఫోన్ నంబరు, ఏ రోజు, ఏ దేశానికి వెళుతున్నది, వివరాలతో పాటు చదువు కోసం వెళ్లేవారు అడ్మిషన్ లెటర్, ఉద్యోగార్ధమైతే అపాయింట్ మెంట్ లెటర్, ఇతర అత్యవసర కారణాలైతే టికెట్ వివరాలను ఇందుకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అందిన ధరఖాస్తులను పరిశీలించి ఏతేదీన తదుపరి ప్రత్యేక టీకా శిభిరం నిర్వహించేది తెలియజేయడం జరుగుతుందన్నారు.