ఇవిఎం గోడౌన్ లను తనిఖీ చేసిన కలెక్టర్..


Ens Balu
1
Guntur
2021-06-05 13:49:46

భారత  ఎన్నికల కమిషన్ ఆదేశాల  మేరకు ఇవియం గోడౌన్ లను జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్  తనిఖీ చేశారు.  శనివారం  గుంటూరు ఆర్ డి ఓ కార్యాలయం ఆవరణలోని ఇవియం గోడౌన్ ను, ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్  యార్డ్ లో  వివి పాట్ లను  భద్రపరచిన గోడౌన్ లను జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్  పరిశీలన చేశారు. గోడౌన్ల కు వేసిన తాళాల సీల్డ్ ను, గోడౌన్ల వద్ద ఉన్న అగ్నిమాపక పరికరాలను, సిసి కెమెరా లను, గార్డ్ డ్యూటీ లాగ్ బుక్ ను పరిశీలించారన్నారు.  ఇవియం ల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  ఈవీఎం గోడౌన్ల నోడల్ ఆఫీసర్, అమరావతి – అనంతపురం ఎక్స్ప్రెస్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, వి శైలజ, డిఆర్వొ కొండయ్య, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, గుంటూరు పశ్చిమ తహశీలార్డు మోహన్ రావు, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ సునీల్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.