నిషేధ వ్యూహం..ఆపై ఆదాయం..
Ens Balu
3
విశాఖ సిటీ
2021-06-06 14:21:02
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపల అమ్మకాలను ఆదివారం నిషేధిస్తున్నట్టు కమిషనర్ డా.జి.స్రిజన రెండు రోజులు ముందునుంచే ఆదేశాలు జారీచేసి ప్రచారం చేసినా పట్టించుకోని వారి నుంచి భారీగా అపరాద రుసుము వసూలు చేశారు. ఆదివారం యధా స్థితిగా కొందరు మాంసం చేపల దుఖాణాలు తెరిచారు. దీనితో ఆకస్మికంగా తనిఖీలు చేసిన జివిఎంసీ సిబ్బంది దుకాణాదారులు నుంచి రూ.96,380/- అపరాధ రుసుం విధించినట్లు జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఆదివారం మాంసాహారపు అమ్మకాలు నిషేధించినా..ఆ నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని అలాంటి వారిపై జివిఎంసి పరిధిలోని ప్రత్యేక స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అంతేకాకుండా ఈ అపరాధ రుసుముతో పాటు 86కేజీల మేక మాంసం, 180 కేజీల చికెన్, 60 కేజీల చేపలు, 43కేజీల రొయ్యలు, 20కేజీల పీతలు సీజ్ చేయడమైనదని, వీటిని జివిఎంసి వెటర్నరి డాక్టర్ ఎన్.కిషోర్, శానిటరి ఇన్స్పెక్టర్ ఎన్.వాసు ఆధ్వర్యంలో ప్రత్యేక స్క్వాడ్ బృందం మధురవాడ డంపింగ్ యార్డుకు తరలించి ఫినాయిల్ వేసి పూడ్చి పెట్టినట్టు అదనపు కమిషనర్ తెలిపారు.