విశాఖనగరంలో వేక్సిన్ వేసే ప్రాంతాలివే..
Ens Balu
3
GVMC office
2021-06-06 17:01:57
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని సోమవారం (07.06.2021) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ గుర్తించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేయనున్నట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. "కోవేక్సిన్" మొదటి డోసు 45 సంవత్సరాలు పైబడిన వారికి, రెండవ డోసు 28 రోజులు పైబడిన వారికి ఈకేంద్రాలలో వ్యాక్సినేషన్ వేస్తున్నామన్నారు. అల్లిపురం, భీమునిపట్టణం, బుచ్చిరాజుపాలెం, చెంగల్రావు పేట, చిన్న వాల్తేర్, జ్ఞానాపురం, మద్దిలపాలెం, నరవ, వన్ టౌన్, ఆర్.పి.పేట, సాగర్ నగర్, స్వర్ణభారతి స్టేడియం, అనకాపల్లి, మల్కాపురం, విద్యుత్ నగర్, ఫిషర్మెన్ కోలనీ, కప్పరాడ, లక్ష్మీ నగర్, ప్రసాద్ గార్డెన్స్, తగరపువలస, బర్మా క్యాంపు, పాత గాజువాక, పెదగంట్యాడ, శ్రీహరిపురం, ఆరిలోవ(ఎఫ్.ఆర్.యు), "కోవీషీల్డ్" వ్యాక్సినేషన్ మొదటి డోసు 45సంవత్సరాలు పైబడిన వారికి మరియు రెండవ డోసు 84రోజులు పైబడిన వారికి ఆరిలోవ(ఎఫ్.ఆర్.యు), మధురవాడ, శ్రీహరిపురం(ఎఫ్.ఆర్.యు.), గాజువాక, కణితి, పెదగంట్యాడ, ఆర్.హెచ్.సి. సింహాచలం, ఆర్.టి.సి. ఎం, దువ్వాడ, గోపాలపట్నం ప్రాంతాలలో వ్యాక్సినేషన్ వేస్తున్నారని కమిషనర్ తెలిపారు. ప్రజలు ఈవిషయాన్ని గమనించి ఆయా కేంద్రాలలో భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కమిషనర్ ఆ ప్రకటనలో కోరారు.