కరోనా వైరస్ కంటే దారుణంగా మొబైల్ సెల్ నెట్వర్క్ లు వినియోగదారులను దారుణంగా పీడించేస్తున్నాయి. సమయానికి రీచార్జ్ చేయకపోతే ఇన్కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ కట్ కట్ చేసే మొబైల్ నెట్వర్క్ కంపెనీలు తీసుకున్న మొత్తానికి నాణ్యమైన వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ ఇవ్వడం లేదు. పోనీ కస్టమర్ కేర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దామన్నా కరోనా వైరస్ కారణంగా కష్టమర్ సర్వీసులన్నీ ఆన్ లైన్ లోనేనని చెప్పి తప్పించుకుంటున్నాయి సెల్ నెట్వర్క కంపెనీలు. అతి తక్కువ నెట్వర్క్ సిగ్నల్ వున్న కంపెనీల్లో ముందు వరుసలో జియో ఉండగా, రెండో స్థానంలో ఎయిర్ టెల్, మూడో స్థానంలో బీఎస్ఎన్ఎల్, నాలుగో స్థానంలో వీఐ(వొడాఫోన్,ఐడియా)లు ఉన్నాయి. ఇందులో కాస్త బీఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్వర్క్ వాయిస్ కాల్ విషయంలో ఇబ్బందులుు పెట్టినా ఇంటర్నెట్ స్పీడ్ 3జి పూర్తిస్థాయిలో అందిస్తుంది. మిగిలిన సెల్ నెట్వర్క్ కంపెనీలన్నీ 4జి పేరుతో వినియోగదారులను మోసం చేస్తూ..కనీసం 2జి నెట్ స్పీడ్ కూడా ఇవ్వడం లేదు. ఎంతదారుణమంటే జియో నెట్వర్క్ ఇంటర్నెట్ స్పీడ్ కి కనీసం వాట్సప్ కూడా ఓపెన్ కావడంలేదు. వాయిస్ కాల్స్ లో క్లారిటీని దారుణంగా తగ్గించేశారు.., ఇంటర్నెట్ స్పీడ్ ని దారుణంగా తగ్గించేసింది.. ఇక ఎయిర్ టెల్ అయితే గ్రామీణ ప్రాంతాలో రోజుకి కేవలం రెండు గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఉదయం ఒక గంట, సాయింత్రం ఒక గంట మాత్రమే పనిచేస్తుంది. ఆ సమయంలోనే వినియోగదారులు కాల్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఐడియా నెట్వర్క్ కూడా ఇంటర్నెట్ స్పీడ్ ఇవ్వకపోయినా వాయిస్ క్లారిటీ బాగానే ఇస్తుంది.
అన్నింటి బిఎస్ఎన్ఎల్ వాయిస్ కాల్స్ క్లారిటీ లేకపోయినా ఇంటర్నెట్ స్పీడ్ ఖచ్చితంగా అందిస్తోంది. రీచార్జ్ గడువు అయిపోతుందని వారం రోజులు ముందునుంచే మెసేజ్ లో అలెర్ట్ చేసే మొబైల్ నెట్వర్క్ లు సేవల విషయంలో అత్యంత దారుణంగా మోసం చేస్తున్నాయి. ఈ మొబైల్ నెట్వర్క్ ల నియంత్రించే ట్రాయ్ గానీ, డాట్ కానీ కనీసం కలుగజేసుకోవడం లేదు. అంతేకాదు సమాచార మంత్రిత్వశాఖ పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. దీనితో సెల్ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు వినియోగదారులను నిట్టనిలువునా దోపీడికి గురిచేస్తున్నాయి. అదేమంటే తమ నియమ నిబంధనలన్నీ ఒప్పుకునే వినియోగదారులు మా మొబైల్ నెట్వర్క్ లను ఎంచుకుంటున్నారని తిరిగి బుకాయిస్తున్నాయి. వాస్తవం ఏంటంటే ఏదైనా ఒక సెల్ నెట్వర్క్ కంపెనీలో మొబైల్ నెంబరు తీసుకునే సమయంలో మనం పెట్టే సంతకాలే వారికి రక్షణగా నిలుస్తున్నాయి. అతిచిన్న అక్షరాల్లో వారికి తగ్గట్టుగా రాసుకున్న నిబంధనలకు వినియోగదారులు అంగీకరిస్తూ సంతకాలు చేయడంతో వారికి నచ్చినట్టు వినియోగదారులను మోసం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందరికీ మొబైల్ ఫోన్లు అలవాటైపోవడంతో వినియోగదారుల వీక్ నెస్ ను మొబైల్ నెట్వర్క్ కంపెనీలు సొమ్ముచేసుకుంటున్నాయి..