మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియ ప్రణాళికా బద్దంగా చేపట్టాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆరిలోవ (ఎఫ్.ఆర్.యు.) సెంటర్ ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరూ ఎటువంటి అపోహలకు తావివ్వకుండా వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. ఆ సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని, వ్యాక్సినేషణ్ వేసే సిబ్బందికి సహకరించాలని సూచించారు. అనంతరం డాక్టరు అనిత, సిబ్బందితో మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయంచుకొనుటకు వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. ఎఫ్.ఆర్.యు. సెంటర్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎప్పటికప్పుడు తోలాగించాలని, పరిసరాలను శానిటేషన్ చేయించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. అనంతరం 11వార్డులను క్లాప్ (CLAP) పధకంలో భాగంగా కాలువలను, రోడ్డులను తనిఖీ చేశారు. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. చెత్తను వెంట వెంటనే డంపింగు యార్డుకు తరలించాలని, కాలువలలోను రోడ్డు ప్రక్కన బ్లీచింగు చల్లాలని శానిటరి ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. ఈ పర్యటనలో అరిలోవ (ఎఫ్.ఆర్.యు.) ఆసుపత్రి సిబ్బంది, వార్డు శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.