జగనన్న తోడు పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీలేని రుణాలను కరోనా కష్టకాలంలో కూడా పేదలకు ఆసరా గా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలుస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు ఏర్పాటు చేసిన జగనన్న తొ డు పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు మాల గుండ్ల శంకర నారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చిరు వ్యాపారు లకు తోడుగా నిలవాలని వారి జీవన విధానాన్ని మార్చాలని అంతేగాక వారందరినీ ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లి వారి జీవితాల్లో వెలుగు నింపాలని ఒక మంచి ఆలోచనా విధానంతో జగనన్న తోడు పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. చిరు వ్యాపారులు అధిక వడ్డీలు తీసుకొని పెట్టుబడులు పెట్టి ఎంతో నష్టపోతున్నారని గుర్తించి పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించే విధంగా ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం రూ.10 వేల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత సంవత్సరం నవంబర్ 25న రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.35 లక్షల మంది లబ్ధిదారులకు సున్నా వడ్డీ కింద రూ. 10,000 చొప్పున రుణాలను అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రెండవ విడతగా జగనన్న తోడు పథకం ద్వారా 3.70 లక్షల మంది తో కలిపి మొత్తం 9.05 మంది చిరు వ్యాపారులకు రూ 9 .05 కోట్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు . ఇలాంటి కార్యక్రమాలు ప్రస్తుత కరోనా కష్టకాలంలో దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు అమలు చేయని విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే విధుల్లో తిరుగుతూ చిరు వ్యాపారులను ఆదుకోవడమే ధ్యేయంగా ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా వడ్డీ లేని రుణాలు జమ చేస్తున్నదని తెలిపారు. అంతేగాక ప్రభుత్వ పథకాలను ఒక నిర్దిష్టమైన సమయంలో అమలు చేసేందుకు ప్రణాళిక బద్దంగా ముఖ్యమంత్రి సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి క్రమం తప్పకుండా తేదీల మేరకు అర్హులైన వారికి లబ్ధి చేకూర్చడం జరుగుతోందన్నారు. తన పాదయాత్రలో ప్రజలకిచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి హామీలను దశలవారీగా వారిగా నెరవేరు స్తున్నారని మంత్రి శంకర నారాయణ తెలిపారు.