రాయల్ యూత్ సొసైటీకి ఉత్తమ అవార్డు..


Ens Balu
2
Anantapur
2021-06-08 10:46:09

సమాజం అభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీసీ హాలు నందు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి ఏటా జిల్లా స్థాయి ఉత్తమ యువజన సంఘం అవార్డు ప్రదానం లో భాగంగా 2019- 20 సంవత్సరానికి గాను రాయల్ యూత్ సొసైటీని జిల్లా ఉత్తమ యువజన సంఘంగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఎంపిక చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ డా.ఏ. సిరి లు సొసైటీ అధ్యక్షుడు రమేష్ కు సుంకర అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ" నేటి యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉత్తమ యువ సంఘం రాహుల్ యూత్ సొసైటీ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో  నెహ్రూ యువ కేంద్ర డీడీవో శ్రీనివాసులు ,రాష్ట్రపతి అవార్డు గ్రహీత బిసతి భరత్ ,తోట నాగరాజ్ , జగ్గా రఘు, ధనుంజయ, సునీల్, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.