ఆటో డ్రైవర్లకు అండగా వాహన మిత్ర..


Ens Balu
3
Anantapur
2021-06-08 11:06:16

కోవిడ్ విపత్తులో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అండగా నిలుస్తోందని .నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని 20 వ డివిజన్ లో జరుగుతున్న వాహన మిత్ర సర్వేలో మంగళవారం నగర మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ సాకే చంద్రలేఖ తో కలసి డివిజన్ పరిధిలో ఆర్వ్హత ఉన్న ఆటో డ్రైవర్లనుండి వాహన మిత్ర దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ గతంలో ఆటోలు రిపేరిలు వస్తే రిపేరీ ల కోసం  వడ్డీ వ్యాపారులతో అధిక వడ్డీకి తీసుకునే పరిస్థితి ఉండేదన్నారు..వచ్చిన ఆదాయం వడ్డీ వ్యాపారులకు సరిపోయేదని కుటుంబ పోషణ కు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆటోల మైంటెనెన్స్ కోసం వాహన మిత్ర ప్రవేశ పెట్టి ప్రతియేటా 10వేల రూపాయలు అందిస్తుండటం ఆటో డ్రైవర్లకు వరంగా మారిందన్నారు ఈ అవకాశాన్ని  ఆటో డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.కోవిడ్ సమయంలో అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమేనని ఈ సందర్భంగా మేయర్ కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కుళ్లయిస్వామి, కొర్రపాడు హుస్సేన్ పిరా తదితరులు పాల్గొన్నారు.