కోవిడ్ రెండోదశ ఉద్ధృతి నేపథ్యంలో బాధితులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆక్వా రైతుల సంక్షేమ సొసైటీ (చెయ్యేరు) రూ.2,79,116 గోడితిప్ప ఆక్వా రైతులు రూ.61 వేలును జిల్లా కోవిడ్ సహాయ నిధికి విరాళంగా అందించారు. ఈ మేరకు రైతుల ప్రతినిధులు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డికి చెక్కులు అందజేశారు. సామాజిక బాధ్యతతో కోవిడ్ సహాయ నిధికి తమ వంతు సహాయాన్ని అందించిన ఆక్వా రైతులకు కలెక్టర్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, మత్స్య శాఖ జేడీ పీవీ సత్యనారాయణ, సంక్షేమ సొసైటీ ప్రెసిడెంట్ టి.నాగభూషణం, వైస్ ప్రెసిడెంట్ బి.శ్రీనివాసరావు; గోడితిప్ప ఆక్వా రైతుల ప్రతినిధులు ఎం.బాబులు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.