భైరవస్వామికి ఏకాంతంగానే పూజలు..


Ens Balu
2
Simhachalam
2021-06-08 11:49:33

విశాఖలోని సింహాచలం  శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి అనుబంధ ఆలయం బైరవకోన బైరవస్వామికి అమావాస్య రోజు ఏకాంతంగా పూజలు నిర్వహిస్తున్నట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. మంగళవారం ఈ మేరకు దేవస్థానంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను అనుసరించి 10వ తేదిన అమావాస్య రోజు స్వామి ఆలయంలో భక్తులకు ప్రవేశం లేదన్నారు. స్వామికి పూజలన్నీ ఏకాంతంగానే జరుగుతాయన్నారు. అమావాస్య రోజు భక్తుల తాడికి అధికంగావుంటుందని ముందుగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని వివరించారు.  భక్తులు గుర్తుంచుకొని దేవస్థాన అధికారులకు సహకరించాలన్నారు. స్వామి ఆలయానికి ఎప్పుడు భక్తులను అనుమతించేది త్వరలోనే తెలియజేస్తామని వివరించారు.