ఆర్అండ్ఆర్ పనులు పూర్తిచేయాలి..
Ens Balu
2
Bhogapuram
2021-06-08 12:24:11
విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ పరిధిలోని గూడెపువలస, పోలిపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఆర్ & ఆర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవేన్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన భోగాపురం విమానాశ్రయ ప్రాంతాన్ని వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ పి. కోటేశ్వరరావుతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను, ఆర్&ఆర్ పనులను పరిశీలించారు. నిర్ణీత గడువులోగా ఈ పనులను పూర్తి చేయాలని జేసీ కిషోర్ కుమార్, ఆర్డీవో భవానీ శంకర్ లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అన్ని పనులను సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జేసీ కిషోర్ కుమార్ ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై వివరించారు. ముందుగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవేన్, వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ కోటేశ్వరరావు లను జేసీ, ఆర్డీవో పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో వి.ఎం.ఆర్.డి. ఎ. కమిషనర్ పి.కోటేశ్వరరావు, జేసీ కిషోర్ కుమార్, ఆర్డీవో బి.హెచ్. భవానీ శంకర్, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.