సేంద్రియ వ్యవసాయంతో ఎంతో లాభం..


Ens Balu
3
Srikakulam
2021-06-08 12:36:10

సేంద్రీయ వ్యవసాయంతో రైతుకు అధిక లాభం చేకూరుతుందని ఉద్యానవన శాఖ కమీషనర్ యస్.యస్.శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా ఎచ్చెర్ల మండలం కొంగరాంలో 2వేల చదరపు అడుగుల్లో జి.కృష్ణప్రసాద్ నెలకొల్పిన ఫామ్ హౌస్ ను ఆయన సందర్శించారు.  ఫామ్ హౌస్ లో పండించిన కాయగూరలు, పూలమొక్కలను పరిశీలించి వివరాలు అడిగితెలుసుకున్న ఆయన సేంద్రీయ పద్ధతిలో పంటలను పండిస్తున్న కృష్ణప్రసాద్ ను అభినందించారు. జిల్లాలో చామంతి, బంతి వంటి పూలసాగు విస్తారంగా ఉందని, రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకు  చామంతి, బంతి వంటి పూలసాగును మరింత విస్తరింపచేసి ఉద్యానవన శాఖ తరపున రైతులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతు సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తే పంటకు అయ్యే ఖర్చులు తగ్గి రాబడి పెరుగుతుందని అన్నారు. అంతేకాకుండా దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పారు. సాంప్రదాయ పద్ధతులే కాకుండా ఆధునిక పద్ధతిలో కూడా ఉద్యానవన పంటలను సాగుచేసి డ్రిప్, పోలీహౌస్  షెడ్ మెట్ లను ప్రభుత్వం అందించే సహకారంతో రైతులు ఏర్పాటుచేసుకొని మరింత అధిక లాభాలను ఆర్జించాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ పర్యటనలో  ఏ.పి.ఎం.ఐ.పి పథక సంచాలకులు ఏ.వి.యస్.వి. జమదగ్ని, ఏ.పి.డి వరప్రసాద్, హెచ్.ఓ స్వాతి, వి.ఏ.ఏ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.