మహా విశాఖను స్వచ్ఛతగా ఉంచాలి..


Ens Balu
3
GVMC office
2021-06-08 13:32:37

విశాఖ మహా నగరాన్ని స్వచ్ఛతగా ఉంచాలని జివిఎంసి అదనపు కమిషనర్  డా. వి. సన్యాసి రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం  జివిఎంసి ప్రధాన ఆరోగ్య శాఖ అధికారులు, జోనల్ కమిషనర్లతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన సేవ సౌలభ్యం కొరకు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని, దీనిని బలోపేతం చేయాలని, మొదటిగా ప్రతి సచివాలయ పరిధిలో 1,000 నుండి 1,200 వందల ఇళ్ళు మించకుండా వుండాలని ఆ విధంగా ఈ-మ్యాపింగు చేయాలని ఆదేశించారు. సచివాలయ పరిధిలో చెత్త తరలించే వాహనం యొక్క రోడ్డు మ్యాప్ ఉండాలని, పిన్ పాయింట్ వారిగా కార్మికులను సర్దుబాటు చేయాలన్నారు. ఏ పనికి నిర్దేశించిన వారిని ఆ పనికి మాత్రమే కార్మీకులను వినియోగించాలని, త్వరలోనే జివిఎంసికి 690 వాహనాలు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతాయని అన్నారు. ప్రతీ రోజు కాలువలు, రోడ్లను శుభ్రం చేసి ఆ చెత్తను పోగులు పెట్టిన వెంటనే సంచులలో నింపాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయనీయరాదని, బహిరంగ మల మూత్ర విసర్జన జరగకుండా చూడాలని, ప్రజా మరుగుదొడ్లు ప్రతి రోజూ శుభ్రంగా ఉంచాలని, వాటిని శుభ్రంగా ఉంచాలని, ప్రతి ఇంటికి మూడు రంగుల చెత్త బుట్టలను అందించాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మీకులకు హాజరు పక్కాగా అమలు చేయాలని పారిశుధ్య కార్మీకులు డెప్యుటేషన్ పై ఉంటే వారిని వెనక్కి పిలిపించి పారిశుధ్య పనులకు వినియోగించాలని ఆదేశించారు. ఎవ్వరు ఎక్కడ పనిచేస్తున్నారు, వారి వివరాలు సాయంత్రానికల్లా అందించాలని అధికారులను ఆదేశించారు.    

ఆన్లైన్ వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టం(OWMS) జరగలేదని ప్రతి రోజు ప్రతి ఇంటికి వెళ్లి ట్యాగ్ చేయాలని ఆదేశించారు. రోడ్డు స్వీపింగు పక్కాగా జరగాలని స్వీపింగు చేసేటప్పుడు మిషన్ నుండి ధూళి  బయటకు వస్తుందని, దానిని నివారించాలని అధికారులను ఆదేశించారు. ఎస్.హెచ్.జి. గ్రూప్ ద్వారా సేంద్రీయ ఎరువు తయారీ చేయు విధానం ప్రోత్సహించాలని, సచివాలయాల పరిధిలో బ్లీచింగు, శానిటేషన్ చేయాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మీకులకు దుస్తులు, రైన్ కోట్లు, శానిటరి సామగరి ఇచ్చామని ఇంకా ఎవరైనా తీసుకొనియడల వాటిని వెంటనే అందించాలని, చీపుర్లు, పారలు కూడా కార్మీకులకు అందించాలని, గమ్ బూట్లు, కాలువలో పనిచేసే శానిటరి సూపర్వైజర్లకు పారిశుధ్య కార్మీకులు అందించాలన్నారు. నైట్ శానిటేషన్ పక్కాగా జరగాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల సర్వే కొరకు సచివాలయాల వారికి డ్యూటీలను వేయాలని అందరి హెచ్.ఒ.డి.లకు కమిషనర్ ఆదేశించారని అది ఎంత వరకు అమలు చేశారని ఆరా తీసారు. వెంటనే అందరికి డ్యూటీలు వేయాలని ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, అందరు జోనల్ కమిషనర్లు, ఎఎంఓహెచ్లు, కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయక ఇంజినీరు, శానిటరి సూపర్వైజర్లు, శానిటరి ఇన్స్పెక్టర్లు, ఎం.ఎస్.ఎఫ్.  ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.