కరోనా విపత్తు సమయంలో నిరుపేదలకు సహాయం చేసే దాతల సేవలు మరువలేనివని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. మంగళవారం నగర పరిధిలోని ఇటీవల కోవిడ్ బారినపడి కోలుకున్ననిరుపేద కుటుంబాలకు స్వాంతన సేవా సమితి ఆధ్వర్యంలో మేయర్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాంతన సేవా సమితి డైరెక్టర్ ప్రజ్ఞా కుమార్, అన్నా గ్రేస్ లకు ఈ నిత్యావసర సరుకులు సమకూర్చి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి నిరుపేదలను, నిరాశ్రయులను ఆదుకోవాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంతన సేవాసమితి డైరెక్టర్ ప్రజ్ఞా కుమార్, అన్నా గ్రేస్, 11వ వార్డు ఇంచార్జ్ గొలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.