అప్పన్న దర్శన సమయం పెంపు..
Ens Balu
3
Simhachalam
2021-06-09 12:48:24
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలోని సింహాద్రి అప్పన్న స్వామివారి దర్శన సమయం 2గంటల పెంచినట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఈఓ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వామివారి దర్శన సమయం పెంచినట్టు వివరిచారు. ఈ పెంచిన సమయం 11వ తేది నుంచి అమలులోకి వస్తుందన్నారు. ఉదయం 6 :30 నుంచి 1:30 మధ్యలో భక్తులు దర్శించుకోవచ్చనని తెలియజేశారు. దర్శన సమయంలో ప్రభుత్వ నిర్ధేశించిన కర్ఫ్యూ నిబంధనలు...మాస్కు ధారణ, బౌతిర దూరం, పరిశుభ్రత, అమలు జరుగుతాయన్నారు. మధ్యలో 11:30 నుంచి 12:00 కు రాజభోగం ఉంటుందని చెప్పారు. సుప్రభాతం నుంచి పవళింపు వరకు ... స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ సంప్రదాయబద్ధంగా జరుగుతాయని వివరించారు. ఈ నియమం 20 వ తేదీ వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని స్వామివారి భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.