శిరోముండనం వ్యవహారంలో ఆ మహిళ ఎవరు...?
Ens Balu
2
Pendurthi
2020-08-31 17:30:19
విశాఖజిల్లా పెందుర్తిలో సుజాత నగర్ ప్రాంతంలో దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసు విషయంలో పోలీసులు పురోగది సాధిస్తున్నారు. నూతన్ నాయుడి ఇంట్లో దళిత యువకుడిని కొడుతూ, శిరోముండనం చేయించిన ఘటనలో మరో కీలక విషయాన్ని పోలీసులు గుర్తించారు. శిరోముండనం చేసిన ఇంటి సీసీటీవీ ఫుటేజీలో ఓ మహిళ ఎవరికో వీడియో కాల్ చేసి శిరోముండనాన్ని చూపించే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె ఎవరికి కాల్ చేసింది? ఈ కేసులో ఇంకెవరి ప్రమేయ మైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇదే విషయమై చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. నూతన్ ఇంటి నుంచి అరుపులు వినిపించాయని, శ్రీకాంత్‌కు గుండుకొట్టించి బయటకు తీసుకురావడాన్ని తాము చూశామని ఇరుగుపొరుగువారు పోలీసులకు తెలిపారు. దీంతో నూతన్ నాయుడు ఈ వ్యవహారంలో పూర్తిగా ఇరుక్కున్నట్టేనని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుం శిరోముండనం చేస్తున్నప్పటి వీడియోను సదరు సిసిటివిలోని మహిళ ఎవరికి ఆ వీడియోకాల్ చేసిందనే విషయం బయటకొస్తే ఈ కేసు విషయంలో పూర్తి ఆధారాలు లభ్యం అయినట్టేనని పోలీసులు భావిస్తున్నారు. అయితే నిన్న మంత్రి నేరుగా బాధితుడి ఇంటికి పరామర్శించిన తరువాత కేసు చిక్కుముడి వీడుతుండటంతో అనుమానితుడిగా భావిస్తున్న నూతన్ నాయుడు ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఓ నేత ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది...