జలక్రీడలపై నివేదిక సమర్పించండి..


Ens Balu
2
Vizianagaram
2021-06-10 14:02:27

విజయనగరం జిల్లాలో జల క్రీడల్లో శిక్షణ పునరుద్ధరించే విషయమై తనకు నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె. వెంకటరావు సెట్ విజ్ సి ఇ ఓ ను ఆదేశించారు. జామి మండలం తాటిపూడి జలాశయం వద్ద నిర్మాణంలో ఉన్న జల క్రీడల అకాడమీ భవనాన్ని జె.సి. వెంకటరావు గురువారం సందర్శించి ఈ అకాడమీ ప్రస్తుత పరిస్థితి పై సిఇఓ విజయ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. యువతకు కయాకింగ్, కన్నోయింగ్ తదితర జల క్రీడల్లో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ఈ అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు గతంలో మంజూరు చేశారని వివరించారు. ఈ అకాడమీ పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని జె.సి. పేర్కొన్నారు. ఏ.పి. సంక్షేమ మౌళిక సదుపాయాల సంస్థ ఈ.ఈ. కూడా పర్యటనలో పాల్గొన్నారు.